Sukumar: ప్రసన్నవదనం డైరెక్టర్ టాలెంట్ ను మెచ్చుకున్న సుక్కూ.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ (Sukumar) శిష్యులకు ప్రత్యేక స్థానం ఉంది. సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో వరుస విజయాలతో సత్తా చాటడంతో పాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులు సక్సెస్ అయిన స్థాయిలో మరే డైరెక్టర్ శిష్యులు సక్సెస్ కాలేదు. సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించిన ప్రసన్నవదనం (Prasanna Vadanam)  పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

అర్జున్ ఆర్య2 (Aarya2) సినిమాలో ఒక సన్నివేశాన్ని, నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక సన్నివేశాన్ని షూట్ చేశారట. సుకుమార్ మాట్లాడుతూ నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమాతో అర్జున్ ప్రయాణం చేశాడని తెలిపారు. అప్పుడే అర్జున్ పై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం కలిగిందని సుకుమార్ కామెంట్లు చేశారు. సినిమాలో మేజర్ ఎపిసోడ్ కు అర్జున్ డైరెక్షన్ చేశాడని ఆయన అన్నారు. ఒక డైరెక్టర్ గా నా అసిస్టెంట్ ను షూట్ చేయమని నేను చెప్పొచ్చని అయితే తారక్ లాంటి పెద్ద హీరో అందుకు అంగీకరించడం విశేషమని సుకుమార్ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎస్ చెప్పారంటే అర్జున్ ప్రతిభ గురించి సులువుగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. అర్జున్ డైరెక్ట్ చేసిన సీన్ నాన్నకు ప్రేమతో సినిమాలో పెట్టామే తప్ప ఆ సీన్ ను మళ్లీ రీషూట్ చేయలేదని సుకుమార్ వెల్లడించారు. ఆర్య2 సినిమాలోని ఒక సీన్ కు కూడా అర్జున్ డైరెక్షన్ చేశారని సుకుమార్ తెలిపారు. సుహాస్ (Suhas)  గురించి సుకుమార్ మాట్లాడుతూ నటనలో సుహాస్ శైలి సపరేట్ అని అన్నారు.

సుహాస్ ఎంపిక చేసుకునే స్క్రిప్ట్ లు అన్నీ బాగుంటాయని ఆయన తెలిపారు. జగడం సినిమా నుంచి సుకుమార్ దగ్గర అర్జున్ పని చేశారు అర్జున్ రాసే స్టోరీలలో లాజిక్ బాగుంటుందని అర్జున్ డైరెక్టర్ గా మారడంతో తాను లాజిక్ ఉన్న సినిమాలు మానేశానని సుకుమార్ పేర్కొన్నారు. అర్జున్ ను మెచ్చుకుంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ శిష్యులకు ఇండస్ట్రీలో తిరుగులేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus