విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని ప్రమోట్ చేస్తున్న సుకుమార్..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘దొరసాని’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయమవుతుంది. వీరిద్దరికీ ఇది మొదటి చిత్రం అయినప్పటికీ మంచి నటన కనపరిచారని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. ఇక విడుదల చేసిన టీజర్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై క్రేజ్ ఏర్పడింది. జులై 12 న విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు.

మన లెక్కల మాస్టారు, స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ చేతుల మీదుగా జులై 1న ‘దొరసాని’ ట్రైలర్ ను విడుదల చేయనున్నాడట. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘మధుర ఎంటర్‌టైన్మెంట్స్’ ‘బిగ్ బెన్ సినిమాస్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతమందించాడు. మరి ఈ చిత్రంతో బుల్లి కొండ హిట్టు కొడతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus