Sulthan: కార్తీ ‘సుల్తాన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కార్తీ. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’‌. ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. ‘డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్’ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్‌2న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎంతకు కొనుగోలు చేశారు.

హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలి అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  2.00 cr
సీడెడ్  1.00 cr
ఉత్తరాంధ్ర  3.00 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  6.00 cr

‘సుల్తాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను రాబట్టాలి.డబ్బింగ్ మూవీకి ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. కార్తీ గత చిత్రం ‘దొంగ’ ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే ‘ఖైదీ’ చిత్రం 7కోట్ల పైనే షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమాకి హిట్ టాక్ కనుక వస్తే.. మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఈ కరోనా సెకండ్ వేవ్ టైములో కష్టమనే చెప్పాలి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus