Suma, Rajeev: వైరల్ అవుతున్న సుమ రాజీవ్ వెడ్డింగ్ కార్డ్ ఫోటో!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంది సక్సెస్ అందుకున్నటువంటి సుమ వరుస బుల్లి తెర కార్యక్రమాలను అలాగే సినిమా ఈవెంట్లకు కూడా యాంకరింగ్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతారు. ఇక ఈమె తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అయితే వీరి పెళ్లి సమయంలో పెద్ద వార్ జరిగిందని, తన కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోకపోవడమే కాకుండా వారం రోజులు పాటు గదిలో బంధించారు అంటూ కూడా సుమ తన పెళ్లికి ముందు జరిగిన విషయాలను తెలియచేశారు. ఇక సుమ పట్టుదల చూసినటువంటి తన తల్లిదండ్రులు చివరికి వీరికి వివాహం చేశారని తెలియజేశారు. ఇలా వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీ ఎంతో ఘనంగా తెలుగు కేరళ సాంప్రదాయ పద్ధతులలో జరిగింది.

ఇక వీరి వివాహం జరిగి దాదాపు పాతిక సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో సుమ సోషల్ మీడియా వేదికగా తన వెడ్డింగ్ కార్డ్ ను షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పత్రికను షేర్ చేయడమే కాకుండా మీరు కార్డు చదివారా? 1999లోనే యునిక్ వేలో వెడ్డింగ్ కార్డ్‌ అంటూ సుమ (Suma) ఈ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక సుమ రాజీవ్ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక కుమారుడు చదువులను పూర్తి చేసుకొని ఈయన కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags