Venu, Sumanth: వేణు, సుమంత్ విషయంలో ఊహించనిదే జరిగిందిగా..!

ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. మన తెలుగు సినిమాలకు దేశవిదేశాల్లో కూడా ఆదరణ దక్కుతుంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాల గురించే చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు హిందీ సినిమానే ఇండియన్ గా భావించిన రోజుల్లో హిందీ సినిమాల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేసుకోవచ్చు అని సౌత్ లో ఉన్న అన్ని భాషల్లోని దర్శక నిర్మాతలు భావించేవారు.

కానీ ఇప్పుడు అంతా మన తెలుగు సినిమా ఆర్టిస్ట్ లను తమ సినిమాల్లో పెట్టుకుని మార్కెట్ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే హీరోలుగా రాణించలేకపోతున్న కొంతమంది సీనియర్ హీరోలు కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ లుగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలుగా చేసిన వేణు, సుమంత్ లు కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మారారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో వేణు, ‘సీతా రామం’ లో సుమంత్ కీలక పాత్రలు పోషించారు.

వేణు ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న హీరోనే..! కానీ తర్వాత అతని జోరు తగ్గింది. చివరికి 9 ఏళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఎంతో గ్యాప్ తీసుకుని చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదలై ప్లాప్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుదాం అనుకున్న వేణు ఆశలను దెబ్బ తీసింది ఆ మూవీ.సుమంత్ కూడా అంతే..! ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.

ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ తాజాగా వచ్చిన ‘సీతా రామం’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో సుమంత్ పాత్రని పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనలేము, నెగిటివ్ రోల్ అనలేము. కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ పాత్ర సుమంత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. ముందు ముందు ఇలాంటి పాత్రలు సుమంత్ ఇంకా చేస్తాడేమో చూడాలి..!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus