అంద‌రి దృష్టి క‌ప‌ట‌ధారి పైనే.. ఈసారి పెద్ద హిట్టే కొట్టేలా ఉన్న స‌మంత్..?

అక్కినేని కాంపౌండ్ నుండి వెండితెర ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఓ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈ హీరో నుండి వ‌చ్చిన గ‌త చిత్రాలు సుబ్ర‌మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్ సినిమాలు మ‌రోసారి నిరాశ‌పర్చాయి. అయితే ఇప్పుడు తాజాగా క‌ప‌ట‌ధారి సినిమాతో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు సుమంత్. క‌న్న‌డ‌ సూప‌ర్ హిట్ అయిన‌ థ్రిల్ల‌ర్ క‌లువ‌ధారి మూవీని తెలుగులో క‌ప‌ట‌ధారి పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్ప‌టికే విడుద‌ల అయిన క‌ప‌ట‌ధారి టీజ‌ర్ ఉత్కంఠంగా ఉండ‌డంతో ప్రే‌క్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసింది. సుమంత్ ఈ చిత్రంలో ట్రాఫిక్ పోలీస్‌గా న‌టిస్తుండ‌గా, నాజ‌ర్ పాత్ర కూడా కీల‌కం కానుంద‌ని టీజ‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర ఊహ‌కంద‌ని విధంగా ఉంటుంద‌ని టాక్. కేసు ఛేధించే క్ర‌మంలో సుమంత్‌కు ఎదురయ్యే ప‌రిస్థితులు ప్రేక్ష‌కుల్ని క‌న్నార్ప‌కుండా చేస్తుంద‌ని, ఒక్కో చిక్కుముడిని విప్పే క్ర‌మంలో వ‌చ్చే స‌న్నివేసాలు రోమాలు నిక్క‌బొడియేలా ఉంటాయ‌ని తెలుస్తోంది.

వైవిధ్య‌మైన పాత్ర‌కు అనుగుణంగా సుమంత్ కూడా చాలా సెటిల్డ్‌గా న‌టించాడ‌ని, సినిమా ముంద‌కు సాగే కొద్ది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయి తెలుస్తోంది. దీంతో ఈసారి ప్రేక్ష‌కుల్ని నిరాశ‌ప‌ర్చ‌డ‌ని, ఫైనల్‌గా సుమంత్ క‌ప‌ట‌ధారితో మంచి హిట్ కొట్ట‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ విష‌యం ఎలా ఉన్నా టీజ‌ర్ మాత్రం సినీ ప్రియుల్ని క‌చ్ఛితంగా ఈ సినిమాను ఒక‌సారైనా చూడాల్సిందే అనేలా చేసింది.

ఇక ఆ విష‌యం ప‌క్క‌న పెడితే క‌ప‌ట‌ధారి మూవీ ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ అద్భుతంగా ఉంద‌ని చిత్ర యూనిట్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ.. క‌ప‌ట‌ధారికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ యూనిట్. ఇటీవ‌ల తెలంగాణ‌‌లో థియేట‌ర్స్ తెరిచేందుకు ప‌ర్మిష‌న్ రావ‌డంతో క్రిస్మ‌స్ కానుక‌గా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక‌పోతే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, వెన్నెల కిషోర్, జ‌య‌ప్ర‌కాష్‌, సంప‌త్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ప్రదీప్ కృష్ణమూర్తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క‌ప‌ట‌ధారి సుమంత్‌కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus