ఈ ఏడాది భానుడి భగ భగలు తట్టుకోలేక.. ఒకవారం ముందుగానే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించేసింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా తన చిత్ర బృందానికి ఒక నెల రోజుల పాటు సెలవులు ఇచ్చేశాడట.
ప్రస్తుతం హైదరాబాద్ లో బాహుబలి రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటుండగా.. గత కొద్ది రోజుల నుంచి ఎండల వేడి తట్టుకోలేక, ఎయిర్ కూలర్ల మధ్య షూటింగ్ ను జరుపుతున్నట్లు సమాచారం.
ఇటీవలే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓ నెల రోజుల పాటు చిత్ర బృందానికి విశ్రాంతి ఇచ్చాడు రాజమౌళి. కానీ అనుకున్న సమయానికే బాహుబలి ది కంక్లూషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.