Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి ఇటీవల ‘కూలీ’ వంటి క్రేజీ సినిమా వచ్చింది. దాని ఫలితం అందరికీ తెలుసు. తర్వాత రజినీకాంత్ 173వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా క్రేజీ ప్రాజెక్టు అనే చెప్పాలి. ఎందుకంటే కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే సుందర్ సి దర్శకుడిగా ఎంపికైనట్టు కూడా రివీల్ చేశారు. గతంలో రజినీకాంత్- సుందర్ సి కాంబినేషన్లో ‘అరుణాచలం’ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.

Sundar C out from Thalaivar 173

తమిళంలో అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే కమల్ హాసన్ తో ‘సత్యం శివమ్’ అనే సినిమా చేశారు. అది కూడా బాగానే ఆడింది. సుందర్ సి ఇప్పటికీ హిట్లు కొడుతూనే ఉన్నారు. అందుకే 28 ఏళ్ళ తర్వాత ఇతనితో వర్క్ చేయడానికి రజినీ,కమల్ ముందుకు వచ్చినట్టు అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన వారం తిరక్కుండానే.. ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు సుందర్ సి ఓ లెటర్ రిలీజ్ చేశారు.

‘కొన్ని అనివార్య కారణాల వల్ల రజినీకాంత్- కమల్ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఈ లెజండరీ నటులతో నా అనుబంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. కొద్దిరోజుల నుండి గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ రాసుకొచ్చాడు సుందర్ సి.అతని మాటలు 2 రకాలుగా అర్ధం చేసుకుంటున్నారు కొంతమంది జనాలు. సుందర్ సి భార్య కుష్బూ రజినీకాంత్, కమల్ హాసన్..లకి మంచి స్నేహితురాలు.

అయినప్పటికీ వారితో సుందర్ సి కి ఎక్కడ గ్యాప్ వచ్చి ఉంటుంది? అని అంతా అనుకుంటున్నారు.

చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus