Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

విక్రాంత్, చాందినీ చౌదరి(Chandini Chowdary) జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మరో 2 రోజుల్లో అంటే నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్..లు నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా అజయ్ అరసాడ నేపధ్య సంగీతం అందించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Chandini Chowdary

దీంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రత్యేకంగా నిలిచింది.మరోపక్క ఈ సినిమాపై ఆడియన్స్ కి ఉన్న మరో నమ్మకం ఏంటి అంటే కచ్చితంగా హీరోయిన్ చాందినీ చౌదరి అనే చెప్పాలి. మొదటి నుండి ఈమె ఎంపిక చేసుకునే కథలు, పాత్రలు అన్నీ ప్రామిసింగ్ గా ఉంటాయి అనే నమ్మకాన్ని ఆమె సంపాదించుకుంది. దానికి తోడు తెలుగమ్మాయి.. ఆమె కచ్చితంగా స్టార్ అవ్వాలనే సెంటిమెంట్ కార్డు కూడా ఆమె కలిగి ఉంది.

ఈ మధ్య కాలంలో చాందినీ చౌదరి చేసిన ‘సమ్మతమే’ ‘గామి’ ‘డాకు మహారాజ్’ వంటివి అన్నీ డీసెంట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసినవే. అందుకే ‘సంతాన ప్రాప్తిరస్తు’ పై కూడా చాందినీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో చాందినీ చౌదరి కొన్ని ఇంటి*మేట్ సీన్స్ లో కూడా యాక్ట్ చేసిందట. పాత్రకి తగ్గట్టు.. అలాగే సందర్భానుసారంగానే అవి వస్తాయట.

అయితే చిత్ర బృందం ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడకుండా ఈ సినిమాకి యు/ఎ రేటింగ్ ఆశించడంతో.. ఆ సన్నివేశాలను కట్ చేయాలని సెన్సార్ సభ్యులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.అందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పక తప్పలేదట. అదీ మేటర్.

విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus