నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమాకి కూడా మొదటి రోజు డీసెంట్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. వినాయక చవితి హాలిడే కూడా అందుకు బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. కానీ 2వ రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి.
వీకెండ్ కు మళ్ళీ సెట్ అవుతుంది అనుకుంటే… అలాంటిదేమీ జరగలేదు. వీకెండ్ ను ఈ సినిమా ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.74 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్ర(టోటల్) | 0.57 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.49 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 cr |
ఓవర్సీస్ | 0.23 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.85 cr (షేర్) |
‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.85 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.18 కోట్లను కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.65 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ బాగా డౌన్ అయిపోయాయి. ‘కొత్త లోక’ సినిమా ఎఫెక్ట్ వల్ల ‘సుందరకాండ’ కి పెద్ద దెబ్బ పడింది అని చెప్పాలి.