పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజి’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆ ఇంపాక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా. అలాగే ‘ఫైర్ స్టార్మ్’ ‘సువ్వి సువ్వి సువ్వాలా’ అనే పాటలు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై హైప్ పెంచాయి.
సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజి’ నుండి మరో గ్లింప్స్ ను వదిలారు.
1 : 04 నిమిషాల నిడివి కలిగిన ఈ గ్లింప్స్ లో.. ‘డియర్ ‘ఓజి’..! నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని… నిన్ను చంపాలని.. ఎదురుచూస్తున్నా..! నీ ఓమి’.. అంటూ విలన్ పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మి ఓమి అనే పాత్రతో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది.
ఈ పాత్రకు సింగర్ హేమచంద్ర డబ్బింగ్ చెప్పారు. బహుశా సినిమాలో కూడా విలన్ పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు. ఇక ఇందులో పూర్తిగా ‘ఓమి యొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?’ అనేది తెలియజేశారు.కత్తులతో, సుత్తులతో అమాయకులపై అతను క్రూరంగా దాడి చేస్తున్న విజువల్స్ ఈ గ్లింప్స్ లో ఉన్నాయి.
చివర్లో ‘హ్యాపీ బర్త్ డే ఓజి’ అని చివర్లో పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ చెప్పించారు. అలాగే ఓజి(పవన్ కళ్యాణ్) కత్తితో స్టైల్ గా కనిపించారు. ఈ గ్లింప్స్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :