సింగిల్స్ ను అడ్డం పెట్టుకుని ఉచిత ప్రమోషన్.. వర్కౌట్ అవ్వుద్దా!

అసలే ‘వాలెంటైన్స్ డే’ వస్తుంది. ప్రేమికులంతా వారి సెలెబ్రేషన్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ రోజంతా వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో వారి సందడి మామూలుగా ఉండదు. మరి గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళ సంగతి ఏంటి..! వాళ్ళు సింగిల్ అంటూ రకరకాల మీమ్స్ చేసుకుని అలాగే ప్రేమికుల పై సెటైర్లు వేస్తూ స్టేటస్ లు పెట్టుకుని సంతృప్తి పడతారు. అయితే ఈ సింగిల్స్ ను శాటిస్ఫై చేసి క్యాష్ చేసుకోవాలి అని మన యువ హీరోలు నితిన్, సందీప్ కిషన్ లు ఫిక్సయినట్టు ఉన్నారు.

ఇప్పటికే నితిన్.. తన కొత్త చిత్రం ‘భీష్మ’ నుండీ ‘సింగిలే’ అంటూ ఓ పాటను విడుదల చేసాడు. మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతంలో వచ్చిన ఈ పాట పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అదే ఫార్ములా అప్లై చేసాడు. ‘సింగిల్ కింగులం’ అంటూ తన కొత్త సినిమా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ నుండీ ఓ పాటను విడుదల చేసాడు. ‘ధృవ’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన హిపాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

‘నాప్తే తునై’ అనే తమిళ చిత్రంలో ‘సింగిల్ పాసంగా’ పాటని మనకి ‘సింగిల్ కింగులం’ లా రీమిక్స్ చేశారు. అక్కడ కూడా హిపాప్ తమిజా సంగీతం అందించి.. హీరోగా కూడా నటించాడు. ‘బిగ్ బాస్3’ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడాడు. ఈ పాట బీట్ దగ్గర్నుండీ .. సామ్రాట్ అందించిన లిరిక్స్ వరకూ అదిరిపోయిందని చెప్పాలి. ‘వాలెంటైన్స్ డే’ రోజున ఎక్కువగా ఈ పాటలనే సింగిల్స్ స్టేటస్ లు పెట్టుకుని వైరల్ చేసే అవకాశం ఉందనడంలో అతిశయోక్తిలేదు. ఈ పాటను మీరు కూడా ఓసారి వినెయ్యండి.


జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus