టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.ఇదిలా ఉండగా… సందీప్ ప్రేమలో పడ్డాడా..? అంటే అవుననే కథనాలు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి.కొన్నాళ్ళుగా సందీప్ కిషన్ ఓ అమ్మాయితో సహజీవనంలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి..? సందీప్.. ప్రేమలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా?..
బాలీవుడ్ నటి సోనియా రథీ మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డీకపుల్డ్ మూవీతో పాటు ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3’ వంటి హిందీ సినిమాల్లో ఈ అమ్మడు నటించింది.మరో హిందీ చిత్రం ‘తారా వర్సెస్ బిలాల్’ లో కూడా ఈమె నటిస్తోంది. వీరిద్దరికీ పరిచయం ఎలా అయ్యింది? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. సందీప్ హిందీలో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. అయితే ఆ సినిమాలకి సోనియాకి సంబంధం లేదు.
అయితే సందీప్ కు టాలీవుడ్లోనే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ మంచి స్నేహితులు ఉన్నారు. బాలీవుడ్లో సందీప్ కు ఉన్న ఓ ఫ్రెండ్ ద్వారా సోనియాని కలుసుకున్నాడు. సోనియాకి కూడా ఆ వ్యక్తి మంచి ఫ్రెండే..! అలా మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళకి పరిచయం ఏర్పడడం, అది కాస్తా ప్రేమగా మారడం,ప్రస్తుతం డేటింగ్లో ఉండడం జరిగిందట. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతానికైతే పెద్దల దగ్గర చర్చలు జరుగుతున్నట్టు వినికిడి. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు? అసలు ఇది జరిగే పనేనా? అన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!