అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లో ఆర్మీ మేజర్ గా సందీప్

వరుస పరాజయాల అనంతరం ఇటీవల “నిను వీడని నీడను నేనే” చిత్రంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకొని కాస్త ఊపిరి పీల్చుకున్న సందీప్ కిషన్ తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ క్రమంలో అమేజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ చేశాడు. తన చిరకాల మిత్రులు మరియు దర్శకద్వయం అయిన రాజ్ & డి.కె దర్శకత్వంలో తెరకెక్కిన “ది ఫ్యామిలీ మ్యాన్” అనే వెబ్ సిరీస్ లో సందీప్ కిషన్ ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడు. మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి అమేజాన్ ప్రైమ్ లో లైవ్ స్ట్రీమ్ కానుంది. విడుదలైన ట్రైలర్ ఆల్రెడీ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ లో ప్రియమణి తర్వాత తెలుగు నుంచి నటించింది సందీప్ కిషణే.

ఈ సిరీస్ కోసం సందీప్ దాదాపు 14 రోజులు కాశ్మీర్ లో షూటింగ్ చేశాడట. ఈ సిరీస్ సూపర్ హిట్ అయితే.. మనోడి కెరీర్ కి బాగా ప్లస్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి తరహాలో సినిమా, డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అనే తేడా లేకుండా అన్నిట్లో ప్రయత్నిస్తున్నాడు సందీప్. మరి సందీప్ కి తాను కోరుకున్న హిట్ & బ్రేక్ ఎప్పుడొస్తుందో చూడాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus