Sundeep Kishan: క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సందీప్ కిషన్.. ఏమైందంటే?

సందీప్ కిషన్  (Sundeep Kishan) ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) ‘రాయన్’ (Raayan) వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘మజాకా’ అనే క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు . త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao Nakkina) ఈ చిత్రానికి దర్శకుడు. రాజేష్ దండ (Rajesh Danda)  నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. మరోపక్క విజయ్ (Vijay Thalapathy)  కొడుకు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Sundeep Kishan

సందీప్ కిషన్ ఓకే చేసిన ప్రాజెక్టుల్లో ‘వైబ్’ అనే సినిమా కూడా ఉంది. ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిచబోతున్నారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. డిసెంబర్లో ఓ షెడ్యూల్ ని కేరళలో నిర్వహించాలి అనుకున్నారు. అయితే దీనికి సందీప్ కిషన్ డేట్స్ సర్దుబాటు కావడం లేదు. దీనికంటే ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు ఉండటంతో అతను అవి పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

దీంతో ‘వైబ్’ సినిమా నుండి అతను తప్పుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సందీప్ కిషన్ ప్లేస్ లో బ్రహ్మానందం (Brahmanandam Kanneganti) కొడుకు రాజా గౌతమ్ ను వారు తీసుకున్నారట. కేరళలో నిర్వహించే మొదటి షెడ్యూల్లో రాజా గౌతమ్ పాల్గొనబోతున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) ఫేమ్ ఆర్ జె స్వరూప్(Swaroop RSJ) ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus