ఆ ముగ్గురితో వర్కవుట్ కాలేదు, ఇప్పుడు నాలుగో అమ్మాయి కోసం వెయిటింగ్

  • August 7, 2019 / 04:10 PM IST

ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోయినా.. కెరీర్ ను నెట్టుకొస్తున్న యంగ్ హీరోస్ లో సందీప్ కిషన్ ఒకడు. ఇటీవలే “నిను వీడని నీడను నేనే”తో యావరేజ్ హిట్ అందుకొన్న సందీప్ కిషన్ ఓ ప్రముఖ మీడియా హౌజ్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. “ఇప్పటివరకూ ముగ్గురు అమ్మాయిలతో డేట్ చేశాను కానీ.. వర్కవుట్ అవ్వలేదు. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. ప్రస్తుతం నాలుగో అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా ప్రేమించే పెళ్లి చేసుకొంటాను” అని చెప్పుకొచ్చాడు.

సందీప్ కిషన్ చెప్పిన ప్రకారం మనోడు డేటింగ్ చేసింది హీరోయిన్స్ తోనే అనే విషయం స్పష్టమవుతోంది. ఇదివరకు సందీప్ “రకుల్, రెజీనా, రాశీఖన్నా”లతో డేటింగ్ చేశాడనే ఊహాగానాలు వచ్చాయి. సో, సందీప్ పేర్కొన్న ఆ ముగ్గురు ఈ ముగ్గురేనా అనే దౌట్స్ మొదలయ్యాయి. మరి ఇప్పుడు నాలుగో అమ్మాయి ఎవరు? ఆల్రెడీ మనోడి లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిందా? అనే సందేహాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సందేహాలకు సందీప్ సమాధానాలు చెబుతాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus