జోరు పెంచిన ‘సునీల్’..!
- May 2, 2016 / 09:56 AM ISTByFilmy Focus
కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్.. ‘కృష్ణాష్టమి’ చిత్ర పరాజయం తరువాత జోరు పెంచాడు. ఇటీవలే విడుదలైన ఈడో రకం ఆడో రకం చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చిన సునీల్.. ప్రస్తుతం ఈడు గోల్డ్ ఎహే, జక్కన్న, క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.
తాజాగా ఉపేంద్ర అనే కొత్త డైరెక్టర్ కు సునీల్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర..ఇటీవలే సునీల్ ను కలిసి కథ చెప్పడంతో, ఇందులో నటించడానికి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ చిత్రాన్ని దర్శకుడు ఎన్.శంకర్ నిర్మించనున్నాడని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













