సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా తక్కువ కాదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కమెడియన్ల పారితోషికాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి. తెలుగునాట కొంతమంది కమెడియన్ల ఆస్తుల విలువ కళ్లు చెదిరే స్థాయిలో ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సునీల్ గ్రోవర్ ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రముఖ నటుడు రోడ్డుపై గొడుగులు, మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
కపిల్ శర్మ షో వల్ల ఈ నటుడికి ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. ఈ షోలో వేసిన డిఫరెంట్ గెటప్స్ ఈ నటుడికి పాపులారిటీని పెంచాయి. పలు ఇంటర్వ్యూలలో ఈ నటుడు పాల్గొన్న సమయంలో కపిల్ శర్మ షోకు తిరిగి రావాలని భావిస్తున్నానని అన్నారు. యునైటడ్ కచ్చా వెబ్ సిరీస్ తో పాటు జవాన్ సినిమాలో సైతం ఈ కమెడియన్ నటించారు. ఈ కమెడియన్ రెమ్యునరేషన్ కూడా ఎక్కువ మొత్తమేనని తెలుస్తోంది.
కమెడియన్ సునీల్ గ్రోవర్ ఒక స్టాల్ లో చపాతీలు కూడా చేస్తూ కనిపించారు. సునీల్ గ్రోవర్ సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయగా ఆ పోస్ట్ లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సునీల్ గ్రోవర్ ఈ విధంగా ఎందుకు చేశాడనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. సామాన్య జీవితం గడపాలనే ఆలోచనతోనే సునీల్ గ్రోవర్ ఈ విధంగా చేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సునీల్ గ్రోవర్ (Sunil Grover) చేసిన పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. సునీల్ గ్రోవర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సునీల్ గ్రోవర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో సునీల్ గ్రోవర్ ఈ విధంగా చేయడం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.