చిన్న సినిమాకి సునీల్ ఇంత తగ్గాడా..? షాకవుతున్న ఫ్యాన్స్..!

సుహాస్, చాందినీ చౌదరి, వైవా హర్ష వంటి క్రేజ్ ఉన్న నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కలర్ ఫోటో’ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు సునీల్. ప్రోమోస్ లో కూడా అతను చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. దాంతో ఈ చిత్రం పై క్రేజ్ పెరిగింది. ఇదే ఏడాది విడుదలైన రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా సునీల్ క్లైమాక్స్ లో విలన్ గా కనిపించి అందరికీ షాకిచ్చాడు. ఆ ట్విస్ట్ అయితే బాగానే ఉన్నా.. సునీల్ కు ఎందుకో ఆ గెటప్ సెట్ అవ్వలేదు అనిపించింది.

అయితే ‘కలర్ ఫోటో’ లో మాత్రం సునీల్ పాత్ర ఆకట్టుకునేలానే కనిపిస్తుంది. అయితే ‘డిస్కో రాజా’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలకు సునీల్.. ఒక్క రోజుకి గాను రూ.5 లక్షల వరకూ పారితోషికం అందుకున్నాడట. మరి ‘కలర్ ఫోటో’కి సునీల్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కలర్ ఫోటో’ చిత్రం షూటింగ్లో సునీల్ 9 రోజులు పాల్గొన్నాడట. అందుకు గాను రూ.10లక్షల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తుంది. సునీల్ కెరీర్ ప్రారంభంలో.. అదీ కమెడియన్ గా పాపులర్ అయిన రోజుల్లో రోజుకు రూ. 8లక్షల వరకూ పారితోషికం తీసుకునేవాడట.

ఇక హీరోగా మారిన తరువాత సినిమాకి రూ.2 కోట్ల నుండీ రూ.3కోట్ల వరకూ అందుకునేవాడని తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ‘కలర్ ఫోటో’ కి రోజుకి రూ.1లక్ష చొప్పున తీసుకోవడం అందరికీ షాకిచ్చింది. సునీల్ రేంజ్ పడిపోయిందా అని కొందరు అనుకుంటుంటే..! ‘పాత్ర నచ్చడం వల్ల సునీల్ పారితోషికం గురించి ఆలోచించలేదని’ అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus