ట్రైలర్ లోనేనా..లేక సినిమాలో కూడా సునీల్ రోల్ శూన్యమా…?

గత రాత్రి అల వైకుంఠపురంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో జరిగిన ఈ ఈవెంట్ అభిమానుల జనసందోహం మధ్య గ్రాండ్ సక్సెస్ సాధించింది. కాగా ఈ వేడుకలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. త్రివిక్రమ్ మార్క్ క్లాస్ టచ్.. అల్లు అర్జున్ మార్క్ స్టైలిష్ నెస్ కలగలిసి ఉన్న అల వైకుంఠపురంలో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ విజయం పట్ల సూపర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఐతే దర్శకుడు త్రివిక్రమ్ చిరకాల మిత్రుడు సునీల్ ఈ చిత్రంలో కమెడియన్ రోల్ చేస్తున్న నేపథ్యంలో ట్రైలర్ లో సునీల్ మార్కు కామెడీ ఒకటి రెండు షాట్స్ కనిపిస్తుందని అందరూ భావించారు. ఐతే అనూహ్యంగా అలవైకుంఠపురంలో మూవీలో సునీల్ పాత్రకు అసలు ప్రాధాన్యమే లేనట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. సునీల్ నుండి ఒక పంచ్ డైలాగ్ కూడా చెప్పించలేదు త్రివిక్రమ్. ట్రైలర్ వరకేనా సినిమాలో కూడా సునీల్ పాత్ర శూన్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సునీల్ కెరీర్ గురించి శ్రద్ద తీసుకునేది ఎవరు..? అనిపిస్తుంది.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ ఉన్న సునీల్ మాస్ హీరో అవతారం ఎత్తబోయి కెరీర్ ప్రమాదంలో పడేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఫుల్ టైమ్ కమెడియన్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీలో సీరియస్ ఫైట్స్ చేసిన సునీల్ ని చూసిన జనాలకు…ఇప్పుడు ఆయన కామెడీ చేస్తే నవ్వు రావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి నుండి సునీల్ కి మద్దతుగా ఉన్నారు. ఆయన దర్శకుడిగా మారకముందు నుండే రచయితగా పని చేసిన సినిమాలలో సునీల్ కి మంచి కామెడీ రోల్స్ ఇప్పించారు. సునీల్ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో రాసే వారు త్రివిక్రమ్. మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలలో సునీల్ చేసిన కామెడీ రోల్స్ త్రివిక్రమ్ రూపొందించినవే..

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus