నా కథ నేనే తీస్తా – సన్నీ

సన్నీ లియోన్ స్టిల్ కనపడితేనే వయోబేధం లేకుండా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినట్టు అక్కడే ఆగిపోతారు చాలామంది. అటువంటిది ఆమె బయోపిక్ వస్తుందంటే ఇంకెంత ఆత్రంగా చూస్తారు. ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, దర్శకుడు దిలీప్ మహతా ఈ ప్రయత్నమే చేసి ‘మోస్ట్‌లీ సన్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశారు. భర్త డేనియల్ వెబర్‌తో కలసి సన్నీ నటించిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు కూడా. అయితే సన్నీ దీనికి డుమ్మా కొట్టింది. పైగా ‘‘అది నా కథ కాదు. ఎవరి అభిప్రాయాన్నో డాక్యుమెంటరీగా తీశారు. దర్శకుడి విజన్‌కి అనుగుణంగా నేను నిజాయితీగా నటించానంతే” అని స్టేట్మెంట్ ఇచ్చింది సన్నీ.

అంతటితో ఆగక “నా జీవిత కథను ఎలా తీయాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. నా కథను నేనే తీస్తా” అని పంతం పట్టింది ఈ సెక్సీ సుందరి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనుల్లో ఉన్న సన్నీ ఈ చిత్రానికి తగ్గ దర్శకుడెవరా అని ఆరా తీస్తుందిట. ఇదిలా ఉంటే దిలీప్ తీసిన డాక్యుమెంటరీ భారత్ తో ప్రదర్శితం కాకూడదని అనుకుంటున్నట్టు తెలిపిన ఈ మాజీ పోర్న్ స్టార్ ఆ చిత్రానికి సుమారు 18 నెలలు కష్టపడి 22 వేల గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలిపింది. ఇంత చేసినా ఫైనల్ కట్ చూసేసరికి నివ్వెరపోయానన్న సన్నీ “సంప్రదాయ సిక్కు కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి శృంగారతారగా ఎలా మారింది? అసలు నిజం ఏంటి?” తన సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చింది.

https://www.youtube.com/watch?v=nzS0qlXM9vQ

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus