నాగశౌర్య ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్

ఛ‌లో.. హిట్ కొట్ట‌డానికి ఛ‌ల్ ఛ‌లో.. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంద‌రికీ అనిపించిన భావ‌న ఇదే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఛలో టీజర్, మెలొడీ సాంగ్, టీజింగ్ సాంగ్ తో హల్ చల్ చేసి సూపర్ హిట్ సినిమా వైబ్రేషన్స్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఛలో ట్రైలర్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల‌కు తొలి సినిమానే అయినా కూడా గురువు త్రివిక్ర‌మ్ త‌ర‌హాలోనే పంచ్ డైలాగుల‌ను బాగా పేల్చాడు. బాషా.. బాహుబ‌లి.. త‌ని ఒరువ‌న్.. ఇలా వ‌ర‌స‌గా అన్ని సినిమాల‌పై పంచ్ లేసి క్యూరియాసిటీ పెంచారు. ట్రైల‌ర్ కు ఇవన్నీ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి ఛలో ను ట్రెండింగ్ లో ఉంచేలా చేశాయి. ఈ నెల 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా ఛలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగం”,” జ్యో అచ్యుతానంద” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. వెంకీ కుడుముల దర్శకుడు. శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ విషయం అర్థమై ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్ ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus