మహేష్ తనయ ఎంత ముద్దుగా ఉందో

అవును మరి. ఎంత డబ్బున్నా పేరున్నా ఎవరికైనా అంతకు మించి ఆనందాన్ని ఇచ్చేవి కుటుంబ సభ్యుల సంతోషాలే కదా. అందుకే ప్రిన్స్ ని అదృష్టవంతుడు అన్నది. పైన పిక్ చూసారు కదా. మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ – గారాల పట్టి బేబీ సితార పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో విఘ్న రాజు పక్కన నిలుచున్న ఫోటో చూసేందుకు అభిమానులకు రెండు కళ్ళు చాలటం లేదు. నమ్రతా యధావిధిగా సంప్రదాయ దుస్తుల్లో ఉండగా సితార గులాబి – నీలం కాంబో డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉంది. తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీ తో స్పెండ్ చేయడానికి సమయం కేటాయించి మరీ ఫారిన్ ట్రిప్ వెళ్ళే మహేష్ గుడ్ ఫ్యామిలీ మాన్ అని చెప్పొచ్చు.

మరో రెండు మూడు నెలల దాకా మహేష్ పూర్తిగా భరత్ అను నేనులోనే లీనమవ్వనున్నాడు.ఏప్రిల్ లో విడుదల ఉన్న నేపధ్యంలో షూటింగ్ ప్లాన్డ్ గా వేగంగా జరుగుతోంది. కొడుకు గౌతం కూతురు సితార బాధ్యతలు అన్ని నమ్రతాకే ఇచ్చేసిన మహేష్ 1 నేనొక్కడినేలో గౌతం ఎంట్రీ చేయించాడు కాని సితారను మాత్రం ఫోటోలలో మాత్రమే చూపిస్తున్నాడు. స్టార్ హీరో వారసులు అబ్బాయిలైతే ఓకే కాని అమ్మాయిలు మాత్రం తెరపైకి రావడం అంత సులభంగా జరిగే పని కాదు. కృష్ణ గారి అమ్మాయి మంజుల – నాగబాబు కూతురు నీహారిక అభిమానుల నుంచి వచ్చిన ప్రేమపూర్వకమైన ఆంక్షల వల్లే ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. సో సితారను వెండితెరపై చూడలేకపోయినా గౌతం ఎంట్రీ ఓ పదేళ్ళ తర్వాత అయినా ఉండే అవకాశాలు ఉన్నాయి. మహేష్ కెరీర్ స్టార్ట్ చేసింది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే. ముగ్గురు కొడుకులు – కొడుకు దిద్దిన కాపురం – గూడచారి నెంబర్ 117 లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నాన్న కృష్ణతో కలిసి నటించాడు మహేష్. సోలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ కనిపించిన లాస్ట్ మూవీ బాలచంద్రుడు. ఆ తరహాలో గౌతం – సితారలతో మహేష్ నటించాలని ఫాన్స్ కోరుతున్నారు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus