సూపర్ స్టార్, యంగ్ టైగర్, మెగాపవర్ స్టార్ కలిసి వస్తున్నారు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ మూడు కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలను ఒక ఫ్రేమ్ లో చూడాలన్న కోరిక ప్రతి ఒక్క సినిమా అభిమానికి ఉంటుంది. ఆ కోరికను తీర్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు డి.వి.వి.దానయ్య. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో “భరత్ అనే నేను” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను హైద్రాబాద్ లోని ఎల్.బి.స్టేడియంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా యంగ్ టైగర్ ఎన్టీయార్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేయనున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం దానయ్య బ్యానర్ లోనే బోయపాటి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-చరణ్ కలిసి రాజమౌళి తెరకెక్కించనున్న “ఆర్.ఆర్.ఆర్” (వర్కింగ్ టైటిల్)లో నటించనున్నారు. ఈ చిత్రానికి కూడా నిర్మాత దానయ్య కావడం వల్లే ఈ ముగ్గురినీ సంయుక్తంగా ఒకే వేదికపై చూపించడానికీ సన్నద్ధమవుతున్నాడు. ఈ ఘట్టమనేని, నందమూరి, కొణిదెల కుటుంబాల కలయిక ఎల్బీ స్టేడియంలో జనాల భారీ సమీకరణకి నాంది పలికి ఈ మూడు కుటుంబాల నడుమ సంబంధబాంధవ్యాలు ఏర్పడాలని కోరుకొందాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus