సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో తెలుగు రాష్ట్రాల్లోని జనాలు శోక సంద్రంలో మునిగిపోయారు అనే చెప్పాలి. తండ్రి మరణం మహేష్ బాబుని అలాగే అతని కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న సినీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ పెద్ద ఎత్తున కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.ఈరోజు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. అయితే కృష్ణ మరణానికి ముందే తన ఆస్తికి సంబంధించిన వీలునామా రాయించేశారు అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
నిజానికి సూపర్ స్టార్ కృష్ణ గారు వెనకేసింది తక్కువే. ఆయనలో ఉన్న అతి మంచితనం అనేది.. చివరికి ఒక్క రూపాయి కూడా మిగలకుండా చేసేసింది. స్నేహితులు, బంధువులకు లేదనకుండా ఎంత ఉంటే అంత డబ్బులు కృష్ణ ఇచ్చేసేవారట. ఈ విషయంలో కృష్ణ గారికి ఇందిరా గారికి మనస్పర్థలు కూడా వచ్చేవట. అంతేకాకుండా కృష్ణ గారిని చాలా మంది నిర్మాతలు మోసం చేసిన సందర్భాలు కూడా ఎక్కువే అని వినికిడి. ఆయన నటించిన సినిమా ప్లాప్ అయితే తన పారితోషికంతో డిస్ట్రిబ్యూటర్లు అలాగే నిర్మాతల నష్టాలు తీర్చేవారట.
అంతేకాదు ఆ నిర్మాతకు ఇంకో సినిమాని ఫ్రీగా చేసిపెట్టడం లేదా సగం పారితోషికానికి చేసి పెట్టడం వంటివి చేసేవారు. ఆ సినిమాలకు కనుక లాభాలు వస్తే.. నిర్మాతలు కృష్ణ గారికి వాటాలు వంటివి ఏమీ ఇచ్చేవారు కాదట. ఆయన స్టూడియోని కూడా అందుకే మెయింటైన్ చేయలేకపోయారు అని వినికిడి. ఫైనల్ గా కృష్ణ గారు మిగిల్చుకుంది ఇప్పటి లెక్కల ప్రకారం రూ.400 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. అది మొత్తం తన మనవళ్ళు, మనవరాళ్ళకే.. చెందాలి అని ఆయన వీలునామాలో రాశారట. ముఖ్యంగా కొడుకుల బిడ్డలు అంటే రమేష్ బాబు, మహేష్ బాబు ఎక్కువ వాటా చెల్లుతుందట.
అంతేకాకుండా కూతుర్ల బిడ్డలకు కూడా ఇంత పర్సెంటేజ్ అనే వాటా ఉంటుందని తెలుస్తుంది. అయితే నరేష్ కు మాత్రం వాటా దక్కదు. ఎందుకంటే అతను విజయనిర్మల గారి కొడుకు. కృష్ణ గారు విజయనిర్మలగారిని రెండో పెళ్లి చేసుకున్నారు.అప్పటి నుండి కృష్ణ గారి వద్దే నరేష్ ఉంటున్నాడు.అతనికి పెళ్లైనప్పుడు వేరే ఇంట్లోకి వెళ్లినా. తన భార్యలతో విడిపోయాక మళ్ళీ విజయ నిర్మల గారి వద్దకు వచ్చేశాడు. ఆవిడకి సంబంధించిన ఆస్తిలో నరేష్ కు మరియు అతని సంతానానికి వాటా చెల్లుతుంది. అది కూడా వందల కోట్ల పైనే ఉంటుందని వినికిడి.