Mahesh Babu: మహేష్ బాబుకి మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డ్.. 21 ఏళ్ల క్రితం అలా..!

  • May 24, 2024 / 01:39 PM IST

‘ఒక్కడు’ (Okkadu) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ‘నిజం’ (Nijam) అనే సినిమా వచ్చింది. ఆ టైంలో వరుస సక్సెస్..లతో ఫామ్లో ఉన్న దర్శకుడు తేజ (Dharma Teja Jasti) తెరకెక్కించిన మూవీ ఇది. ‘ఒక్కడు’ తో మహేష్ కూడా స్టార్ అయ్యాడు. దీంతో ‘నిజం’ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాలను సినిమా మ్యాచ్ చేయలేదు. కాబట్టి.. మొదటి షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ సమ్మర్ సీజన్.. పైగా మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా..

బాక్సాఫీస్ వద్ద కొన్ని మెరుపులు మెరిపించింది ‘నిజం’ సినిమా. ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ‘నిజం’ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందట. దర్శకుడు తేజ ఈ విషయం పై ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చారు. ప్రాఫిట్స్ వచ్చిన అనుకున్న స్థాయిలో ‘నిజం’ పెర్ఫార్మ్ చేయలేకపోవడంతో… ఫ్లాప్ అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తేజ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అంతేకాదు ‘నిజం’ సినిమా ఆ రోజుల్లోనే 71 కేంద్రాల్లో 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందట. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి.గోపీచంద్ (Gopichand) కూడా విలన్ గా భయపెట్టాడు అనే చెప్పాలి. 2003 మే 23 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.అంటే నేటితో 21 ఏళ్ళు పూర్తి కావస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ‘నిజం’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వైరల్ గా మారాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus