Balayya Babu: బాలయ్యకు షాకిచ్చిన కోర్టు.. అసలు స్టోరీ ఇదే!

  • August 29, 2022 / 08:11 PM IST

నందమూరి బాలకృష్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బాలయ్య 100వ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ తో 2017లో ఈ సినిమాను విడుదల చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వై రాజీవ్ రెడ్డి జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రాత్మిక సినిమా కావడంతో ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినిమా యూనిట్ కోరింది.

దీంతో అప్పట్లో ఈ సినిమాకు అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇచ్చింది. పన్ను మినహాయింపు ఇచ్చినా.. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని చెబుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పన్ను రాయితీ తీసుకున్నప్పటికీ దాని ప్రతిఫలం మాత్రం ప్రేక్షకులకు దక్కేలా చేయలేదని..

ఎప్పటిలానే టికెట్ రేట్లు అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పన్ను రాయితీ పొందిన డబ్బులను సినిమా యూనిట్ నుంచి రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది.

విచారణలో భాగంగా నందమూరి బాలకృష్ణతో పాటు సినిమా నిర్మాతలు అయిన రాజీవ్ రెడ్డి, సాయిబాబా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేశారని టాక్. మరి దీనిపై బాలయ్య స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus