Supritha,Surekha Vani: రెండో పెళ్లిని టైం డిసైడ్ చేస్తుందన్న సుప్రీత!

  • February 26, 2022 / 08:00 PM IST

పదుల సంఖ్యలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సురేఖ వాణి పాపులారిటీని సంపాదించుకున్నారు. గతంతో పోలిస్తే సురేఖ వాణికి సినిమా ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో సురేఖ వాణి యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో బాగానే గుర్తింపు ఉంది. సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు తనదైన శైలిలో జవాబు ఇస్తారు. సురేఖ వాణి రెండో పెళ్లి గురించి గతంలో పలు వార్తలు వైరల్ కాగా ఆ వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే.

Click Here To Watch

అయితే తాజాగా సుప్రీత ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సురేఖ వాణి పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాన్నకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని సుప్రీత అన్నారు. అందుకే నేనే తలకొరివి పెట్టానని ఆమె తెలిపారు. నాన్న సోదరుడు పాడె మోయవద్దని చెప్పారని నాన్న బంధువులు చివరి చూపు చూడటానికి కూడా రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ తరపు బంధువులు ఆ సమయంలో అన్ని పనులను చూసుకున్నారని ఈ విషయాలు ఎవరికీ తెలియదని సుప్రీత అన్నారు.

రెండో పెళ్లి అనేది అమ్మ పూర్తిగా తీసుకునే నిర్ణయమని నాకు మాత్రం అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉందని సుప్రీత వెల్లడించారు. అయితే ఏం జరుగుతుందో సమయం డిసైడ్ చేస్తుందని సుప్రీత పేర్కొన్నారు. అమ్మ తన కెరీర్ తో పోల్చితే తన కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారని సుప్రీత వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తాము సెటిల్ అవుతున్నామని సుప్రీత పేర్కొన్నారు. నాన్న లేని బాధను ఇప్పటికీ ఫీలవుతున్నామని సుప్రీత అన్నారు.

సురేఖతో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. సురేఖ వాణి రెండో పెళ్లి గురించి సుప్రీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus