Chiranjeevi: అల్లు రామలింగయ్య సురేఖను ఆ కారణంగానే ఆ హీరోకి ఇవ్వలేదా..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల చోటు చేసుకున్న ఘటన అయినా క్షణాల్లో మనముందు ప్రత్యక్షం అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరగడంతో స్మార్ట్ ఫోన్ వాడని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ద్వారా సంపాదించే అవకాశం కూడా ఉండడంతో చాలా మంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటివో పురాతన విషయాలను కూడా తవ్వి మరో మారు ట్రెండ్ చేస్తున్నారు.

అయితే రెండ్రోజులుగా చిరంజీవి భార్యకు సంబంధించిన ఓ వార్త అక్కడ హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. మరో కొత్త వార్త ఆ ఫ్యామిలీకి సంబంధించింది తెరపైకి రావడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి చిరంజీవి సురేఖ ల జంట ఇండస్ట్రీలోనే కాదు సామాన్య ప్రజలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహమే లేదు.

సురేఖ తండ్రి అల్లు రామయ్య రంజీవి కంటే ముందు ఆమెను ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోకి పెళ్లి చేద్దామనుకున్నారట. అల్లు రామలింగయ్య ఇంటికి స్వయాన ఆ హీరో తండ్రి వచ్చి సురేఖను తన కొడుక్కి ఇవ్వమని అడిగారట. అప్పటికే స్టార్ హీరో కావడం.. ఆస్తిపాస్తులు బాగా ఉండడంతో ఆయనకే ఇచ్చి చేద్దామనుకున్నారట. కానీ ఇద్దరి జాతకాలు కలవకపోవడంతో కూతురు భవిష్యత్తు కోసం ఆ స్టార్ హీరో తండ్రికి రామలింగయ్య నో చెప్పారట.

ఆ తర్వాత వెంటనే చిరంజీవి (Chiranjeevi) సంబంధం రావడం.. రామలింగయ్యకు నచ్చడం వారిద్దరికీ పెళ్లి చేసేయడం చకచకా జరిపోయాయి. ఏ మాటకు ఆ మాట సురేఖ దొరకడం.. నిజంగా చిరంజీవి అదృష్టమనే చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus