Surekha Vani: తన కూతురు సుప్రీత పై సురేఖ వాణి కామెంట్స్ వైరల్..!

  • June 11, 2021 / 07:55 PM IST

బుల్లితెర పై ‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ అనే షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురేఖ వాణి.. అటు తర్వాత వరుస సినిమాల్లో వదిన,అక్క,పిన్ని, అత్త వంటి పాత్రలు పోషించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అటు తర్వాత బిజీ యాక్ట్రెస్ గా కూడా మారిపోయింది. తన సహజ నటనతోనూ, కామెడీ తో ప్రేక్షకులను మెప్పించింది ఈ నటి. సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావొచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఓ స్టార్ అనే చెప్పాలి.

ఈమె కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది సురేఖ. వీళ్ళిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేసేవి. సురేఖతో పాటు సుప్రీత కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ ను బాగా పెంచుకొంది. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను,వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది సుప్రీత.అయితే ఇటీవల ఆమె చేష్టలకి తన తల్లి సురేఖ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

మేటర్ లోకి వెళ్తే.. తాజాగా సుప్రీత నేల మీద పడుకుని, తన పెట్‌ తో ముద్దు ముచ్చట్లు ఆడుతుంది. ఈ ఫోటోని సురేఖ షేర్ చేస్తూ.. ‘ఏంటో ఈ పిచ్చి చేష్టలు’ అంటూ తన కూతురి పై సెటైర్ వేసింది. కొద్దిరోజులుగా తన పెంపుడు కుక్కతో సురేఖ ఆడుకుంటున్న ఫోటోలను సుప్రీత షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల తన పెట్ బర్త్ డేను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus