క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షో ద్వారా పాపులర్ అయిన ఈమె.. 2005 లో వచ్చిన ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అనే చిత్రంతో నటిగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి ఇప్పటికే 100 కి పైగా సినిమాల్లో నటించింది.2019 లో ఈమె భర్త దూరమవ్వడంతో మానసికంగా కృంగిపోయింది సురేఖ. అయితే కూతురు కోసం ఆమె మామూలు మనిషి అయ్యింది. సుప్రీతే ప్రాణంగా బ్రతుకుతుంది సురేఖ వాణి.
ఈమె కెరీర్ ను సెట్ చేసే పనిలో ఆమె బిజీగా ఉంది. సుప్రీత నటనలో శిక్షణ తీసుకుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతల కంట్లో కూడా పడింది. కానీ సురేఖ వాణి మాత్రం సుప్రీతని సినిమాల్లో పంపే ఉద్దేశం లేదని తెలుపుతుంది.కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం సుప్రీత నటనలో కూడా శిక్షణ తీసుకుందని తెలుస్తుంది. ఇంకా నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం రీల్స్, ఫన్నీ వీడియోస్ వంటివి చేస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ మామూలుగా ఉండదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈమెకు 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఈమెకు ఫ్యాన్స్ క్లబ్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె సముద్రం ఒడ్డున అందాలు వడ్డించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :