Surekha Vani, Supritha: ఫ్రెండ్‌ విషయంలో స్పష్టత ఇచ్చిన సుప్రీత

  • January 18, 2022 / 02:10 PM IST

సోషల్‌ మీడియాలో నటి సురేఖ కూతురు సుప్రీత సందడి గురించి మీకు తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు డబుల్‌ బొనాంజా అన్నట్లుగా తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలసి పాటలకు డ్యాన్స్‌ చేసి అభిమానులను, నెటిజన్లను ఫిదా చేస్తుంటారు. పొట్టి గౌన్ల నుండి కవ్వించే చూపుల వరకు ఇద్దరూ ఇద్దరే. అంతేకాదు ఏమాటనైనా కుండబద్దలు కొట్టేలా చెప్పడంలోనూ ఇద్దరూ ఒక్కటే. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సుప్రీత. ఇటీవల సోషల్‌ మీడియాలో నెటిజన్లతో మాట్లాడింది.

సుప్రీతకు ఫ్రెండ్స్‌ బ్యాచ్‌ చాలా పెద్దది. ఆమెను ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏ చిన్న అకేషన్‌ వచ్చినా… అందరూ కలసి సందడి చేస్తున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి అలరిస్తుంటారు కూడా. నేటితరం కుర్రకారు తరహాలోనే ఆ గ్రూపులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. అయితే సుప్రీత ఫొటోల్లో ఎక్కువగా కనిపించే అబ్బాయిల్లో నందు ఒకడు. దీంతో ఇద్దరి మధ్య ఏముంది అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయాన్ని సుప్రీతను అడిగారు ఓ నెటిజన్‌.

దాని సుప్రీత ఇచ్చిన అన్సర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో ఎంతో అనుభవం ఉన్నట్లుగా, పరిణితి ఉన్న అమ్మాయిలా మాట్లాడింది సుప్రీత. ‘‘అవును నందు నా ఫ్రెండ్‌. ప్రతి అమ్మాయికి అలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలి. అయితే ఒక అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్‌గా ఉండలేరు అని కొంతమంది అంటుంటారు. కానీ మేం ఫ్రెండ్స్‌లానే ఉన్నాం, ఎవరు ఏమనుకున్నా సరే మేం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’’ అని సుప్రిత చెప్పింది.

దీంతో ఈ విషయంలో సుప్రీత ఫుల్‌ క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే సుప్రీత మీద ట్రోలింగ్‌, కామెంట్స్‌ వర్షం కొత్తేం కాదు. ఆమె ఏం చేసినా ట్రోలింగ్‌ పక్కా, అప్పుడప్పుడు ఆమె పోస్టుల్లో రాసే అక్షరదోషాలను కూడా నెటిజన్లు ఏకిపారేస్తుంటారు. అయితే ఆమె ఎక్కడా వెరవకుండా అన్నిటికీ తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నందు విషయంలో జరిగింది కూడా. మరి సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు అనేది కూడా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus