హీరోయిన్లకి సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువే ఉంటుంది. వారికి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే ఉంటుంది. అలాగే వారి ఫొటోలకి బోలెడన్ని లైకులు కురుస్తూ ఉంటాయి. అయితే ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే సురేఖా వాణి కూతురు సుప్రీతకి సోషల్ మీడియాలో ఆమెను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది అని చెప్పాలి. సురేఖ వాణితో కలిసి సుప్రీతతో చేసే డాన్స్ వీడియోలు, గ్లామర్ ఫోటో షూట్లు నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి.
వీళ్ళ డ్రెస్సింగ్ పై కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వాళ్ళు సీరియస్ అవుతుండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ తర్వాత వీటిని లైట్ తీసుకుని.. ముందుకు సాగుతుంటారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. తాజాగా సురేఖా వాణి కూతురు సుప్రీత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో ఆమె బాత్ రూమ్ లో బోల్డ్ ఫోజులు ఇచ్చింది.
ఇవి ఆమె (Supritha) ఫాలోవర్స్ కి విపరీతంగా నచ్చేశాయి. దీంతో ఆమె ఫోటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె సినీ రంగప్రవేశం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ.. సురేఖా మాత్రం వాటిని ఖండిస్తూ ఉంటుంది. తన కూతురు సినిమాల్లోకి రావడం ఆమెకు ఇష్టం లేదు అన్నట్టు చెబుతూ ఉంటుంది. అయితే సుప్రీతకి హీరోయిన్ ఛాన్స్ వస్తేనే సినిమాల్లోకి తీసుకువస్తాను అని ఆమె చెబుతున్నట్టు కూడా టాక్ నడుస్తూ ఉంటుంది.