Surender Reddy: తమిళ స్టార్‌ను ఓకే చేసుకున్న పవన్‌ దర్శకుడు… ఆయన వచ్చేలోగా…

  • January 11, 2024 / 01:57 PM IST

మొన్నీమధ్యే అనుకున్నాం… పవన్‌ కల్యాణ్‌తో సినిమాలు చేయాల్సిన దర్శకులు, చేస్తున్న దర్శకులు వేరే సినిమాలు వెతుక్కుంటున్నారు. కొంతమంది మాత్రం ఇంకా లైన్‌లోనే ఉన్నారు అని. ఇలా అనుకున్నామో లేదో మరో దర్శకుడు కూడా హీరోను రెడీ చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడు ఇంకా సినిమా స్టార్ట్‌ చేయలేదు. కథను సిద్ధం చేసే పనిలోనే ఉండే. ఆయన ఎవరో కాదు సురేందర్‌ రెడ్డి. యాక్షన్‌, కామెడీని బాగా మిక్స్‌ చేసి ఎంటర్‌టైనర్‌లు ఇస్తారనే పేరున్న సూరి కొత్త సినిమా కథ రెడీ అట. అంతేకాదు హీరో కూడా రెడీ అట.

తెలుగు దర్శకులు, తమిళ స్టార్‌ హీరోల కాంబో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ కేక్‌ కాంబినేషన్‌. ఈ కోవలోనే సూరి కూడా తమిళ స్టార్‌ను ఓకే చేసుకున్నారట. వైవిధ్యమైన సినిమాలకు ప్రజెంట్‌ కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన విక్రమ్‌తో (Surender Reddy) సురేందర్‌ రెడ్డి నెక్స్ట్‌ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు స్టూడియో గ్రీన్‌ ఏర్పాట్లు చేస్తోంది అని అంటున్నారు. ఇటీవలకు విక్రమ్‌ చెప్పిన పూర్తి కథ నచ్చేయడంతో ‘లెట్స్‌ గో టు సెట్స్‌’ అని అన్నాడట.

విక్రమ్‌ సినిమాల్లో కనిపించే వైవిధ్యం, సూరి సినిమాల్లో ఉండే వినోదం, మాస్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌లో ఈ కథ ఉంటుందట. సౌత్‌ మొత్తం ఈ సినిమాను రిలీజ్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా స్టార్ట్‌ చేసి, అంతే త్వరగా రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నారట. ఎందుకంటే ఈ సినిమా పూర్తయ్యాక తిరిగి పవన్‌ సినిమా కథ మీద కూర్చోవాలని అనుకుంటున్నారట. కథా రచయిత వక్కంతం వంశీనే అని చెబుతున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్‌ చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే విక్రమ్‌కు ఇప్పుడు సరైన మార్కెట్‌ లేదు. కొన్ని సినిమాలు విడుదల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. కానీ సరైన కథ, సినిమాతో వస్తే తిరిగి ఫామ్‌లోకి వచ్చేస్తాడు. ఇక సూరి పరిస్థితి కూడా అదే. కాబట్టి ఈ సినిమాకు విజయం అత్యవసరం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus