మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసిన సురేందర్ రెడ్డి

హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తూనే.. వెంకటేష్, బన్నీ కోసం కథలను సిద్ధం చేస్తున్నారు. అలాగే సురేందర్ రెడ్డి కూడా మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తూనే సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం స్టోరీ సిద్ధం చేశారు. సైరా షూటింగ్ కంప్లీట్ కావడానికి మరో ఆరు నెలలు సమయం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ మూడు నెలలలు సాగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ల్లో సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత స్టార్ హీరో డేట్స్ కావాలంటే మరో ఆరు నెలలు పడుతుంది. అందుకే ఇప్పుడే స్టోరీ రెడీ చేసారని తెలిసింది. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లితో దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ రెండు వారాలుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ ఈనెల 10 వ తేదీకి పూర్తి అవుతుంది. అప్పుడు హైదరాబాద్ కి రానున్నారు. రెండో షెడ్యూల్ కోసం అమెరికాకి వెళ్లేసరికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్ లో మహేష్ కి కథ వినిపించాలని సురేందర్ రెడ్డి అనుకుంటున్నారు. గతంలో మహేష్ బాబుతో “‘అతిథి” అనే సినిమా తీశారు. ఇందులో మహేష్ ని చాలా స్టైలిష్ గా చూపించారు. అయినా హిట్ కాలేదు. ఈసారి ఎలాగైనా మహేష్ తో హిట్ కొట్టాలని మంచి కథ రాసుకున్నట్టు సమాచారం. మహేష్ ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి కి, సుకుమార్ కి మాట ఇచ్చి ఉన్నారు. వీరిద్దరి తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తారా? లేదంటే ముందే మొదలు పెడుతారా? అనేది కథలో ఉన్న విషయంపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus