సైరా నరసింహారెడ్డి లుక్ ని రివీల్ చేసిన సురేందర్ రెడ్డి

  • January 27, 2018 / 10:42 AM IST

తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఖైదీ నంబర్ 150 ఇచ్చిన విజయంతో మరింత ఉత్సాహంగా చిరంజీవి ఈ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ లుక్ తప్ప ఇంకా ఏమీ బయటికి రాలేదు. కానీ నరసింహ రెడ్డి ఎలా ఉంటారో డైరక్టర్ రిలీజ్ చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి ఏ కాస్ట్యూమ్స్‌లో ఉంటారో అదే దుస్తులను తన కొడుకుని ధరించి ఫోటోలు తీసి రిలీజ్ చేశారు. సినిమాలో చిరంజీవికి గడ్డం ఉంటుంది.. ఇతనికి ఉండదు అంతే తేడా. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

చిరు ఫస్ట్ లుక్ కి వచ్చే విధంగానే ఈ బుల్లి నరసింహారెడ్డి కి అభినందనలు వస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ల్లో చిరుతో పటు నయనతార పాల్గొననుంది. మోషన్ పోస్టర్ కి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చనున్నారు. .

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus