ఒక నిర్మాతగా సినిమా విడుదల విషయంలో ఎప్పుడు టెన్షన్ పడలేదు

  • December 11, 2019 / 01:31 PM IST

సింగిల్ లైన్ స్టోరీ విని.. దాన్ని సినిమాగా తీస్తే ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పగల సత్తా, సీనియారిటీ ఉన్న అతి కొద్దిమంది నిర్మాతల్లో సురేశ్ బాబు ఒకరు. ఫ్లాప్ సినిమాలతో కూడా లాభాలు సంపాదించిన చాలా తక్కువ మంది నిర్మాతల్లో సురేష్ బాబు ప్రముఖుడు. ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది. వందల కొద్దీ థియేటర్లు కంట్రోల్లో పెట్టుకొని.. తను నిర్మించే సినిమాలకు సర్దుబాటు చేయడమే కాదు.. తన వద్దకు చిన్న చిత్రాలకు కూడా సహాయం అందిస్తుంటాడు సురేష్ బాబు. అందుకే.. దిల్ రాజు తర్వాత న్యూ ఏజ్ ఫిలిమ్ మేకర్స్ అందరూ సురేష్ బాబును అప్రోచ్ అవుతుంటారు.

అయితే.. అలాంటి సురేశ్ బాబు కూడా “వెంకీ మామ” రిలీజ్ విషంలో కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడ్డాడంటే విడుదల తేదీని డిసైడ్ చేయడం అనేది ఎంత పెద్ద ఇష్యూనో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి దీపావళికి సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ.. వెంకటేష్ కి కాలు బెణకడంతో ఒక్క పాట పెండింగ్ ఉండిపోయింది.. అసలు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. అలాగే.. క్రిస్మస్ కి రిలీజ్ చేస్తే న్యూ ఇయర్ కి పెద్దగా కలెక్షన్స్ ఉండవు. అందుకే యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ 13న సినిమా విడుదలకు ప్లాన్ చేశాడట సురేశ్ బాబు. మరి ఆయన కెరీర్ ఇది పెద్ద రిస్క్ అని ఆయన పేర్కొంటున్నారు. ఈ రిస్క్ ఎలాంటి అవుట్ పుట్ ఇస్తుందో చూడాలి.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus