సినీ ఇండస్ట్రీ పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్….!

ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్ధితి వల్ల అన్ని పరిశ్రమలకు తీవ్ర నష్టాలు వాటిల్లేలా చేస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పై పెద్ద దెబ్బె పడింది అని చెప్పాలి. మొదట ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అనుకున్న తరుణంలో.. జూన్ కు పరిస్ధితి సెట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు మే 3 వరకూ పొడిగించారు. అంటే కనీసం జూలై నెలకు సినీ ఇండస్ట్రీ కోలుకుంటుంది. థియేటర్లు తెరుస్తారు… అంతా సెట్ అయ్యి పోతుంది అని ఆశాభావం వ్యక్తం చెయ్యడం కామన్. నిజానికి సామాన్య సినీ ప్రేక్షకులు.. అది కూడా డబ్బులు పెట్టే ప్రేక్షకుడు ఇంత.. పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు.

అలాంటిది ఓ డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత పాజిటివ్ గా కామెంట్స్ చేయకపోవడం పక్కన పెడితే ఈ 2020 లో అసలు థియేటర్లు ఓపెన్ అవ్వవు అనేలా కామెంట్ చేస్తే ఎంతో మంది గుండెల్లో రాళ్ళు పడిపోవడం ఖాయం. ఇప్పుడు సురేష్ బాబు చేసిన కామెంట్స్ అలానే ఉన్నాయి. విషయం ఏమిటంటే… ‘జూన్, జూలై కి సినిమా థియేటర్ లు ఓపెన్ అవ్వడం.. సినిమా షూటింగ్ లు కూడా మొదలవుతాయి అని పూర్తి స్థాయిలో చెప్పలేము. ఏమో ఈ 2020 వరకూ థియేటర్ లు ఓపెన్ కాకపోవచ్చు ఏమో’ అని సురేష్ బాబు చేసిన కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

ఎంతో అనుభవం ఉన్న నిర్మాత .. డిస్ట్రిబ్యూటర్ .. ఇలాంటి కామెంట్స్ చేసారు అంటే.. నిజంగా ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్ధితి.. అది కూడా 2020 వరకూ తిరిగి ప్రారంభం అయ్యే పరిస్ధితి లేదా?’ అని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. సురేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ తో వారు చాలా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇక మరో నిర్మాత అల్లు అరవింద్ గారు మాత్రం హ్యాపీ గా ఆయన ‘ఆహా’ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో కొంత సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది నిజమైన రేపు అని ఆయన చాలా సార్లు చెప్పినా ఆ దిశగా చాలా మంది అడుగులు వెయ్యనందుకు బాధపడుతున్నారు అని కూడా వినికిడి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus