కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విధంగానే .. థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో 50శాతం ఆకుపెన్సీ తో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అక్టోబర్ 15న(నిన్న) థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా పేర్కొంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు ఒకవైపు.. కరోనా భయం మరో వైపు ఉండడంతో… వైజాగ్ ఐనాక్స్ ను పునః ప్రారంభించగా షోకి రూ.1000లు కూడా వసూల్ కాలేదట. దీనిని బట్టి చూస్తుంటే సురేష్ గారు ఈ లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు చేసిన కామెంట్సే నిజమవుతున్నాయని చెప్పాలి. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న సురేష్ బాబు గారు.. ‘థియేటర్లు తెరిచినా ఈ ఏడాది పూర్తయ్యే వరకూ జనాలు రారని’ ఆయన చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు.
‘వర్షాకాలం, శీతాకాలం కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని కాబట్టి ఎక్కువ శాతం జనాలు థియేటర్లకు రారని.. వచ్చే ఏడాది కూడా చెప్పలేని పరిస్థితని’ ఆయన చెప్పారు. నిన్నటి రిజల్ట్ తో ఆయన కామెంట్స్ నిజమని ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడైతే ప్రేక్షకులు అలాగే సినిమా నిర్మాతలు ఓటిటినే బెస్ట్ అని భావిస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!