Actress: సర్జరీ చేయించుకుని ఇలా అయిపోయిందట.. నటి షాకింగ్ కామెంట్స్!

‘బిగ్ బాస్’ ద్వారా పాపులర్ అయిన వారు ఎంతో మంది ఈరోజు మంచి ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెర పై అలాగే.. సోషల్ మీడియాలో వీళ్ళకి బాగా డిమాండ్ ఎక్కువ. అలాంటి వారిలో ఉర్ఫీ జావెద్ కూడా ఒకరు. బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ ద్వారా ఈమె పాపులర్ అయ్యింది.అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె విచిత్రమైన దుస్తుల్లో కనిపిస్తూ వివాదాలతో, వార్తల్లో నిలుస్తోంది.

ఆమె (Actress) ధరించే దుస్తులు అస్లీలతని ప్రోత్సహించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈమె పై విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఇదిలా ఉండగా… తాజాగా ఈమె కూడా సర్జరీ చేయించుకున్నట్టు తెలిపి శాకిచ్చింది. అందంగా కనిపించడానికి కాకుండా ఇలా తన మొహం పాడైపోవడానికి సర్జరీ చేయించుకున్నట్టు ఈమె చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… నా పెదాలు చిన్నగా ఉండటంతో.. నాకు ఏదో తెలియని వెలితి.

నాకు నిండు పెదాలు కావాలనే ఆశతో 18 ఏళ్ళ నుండీ లిప్ పిల్లర్ సర్జరీ చేయించుకుంటూ వస్తున్నాను. గతంలో నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో ఓ వైద్యుడు తక్కువ అమౌంట్ కే సర్జరీ చేయిస్తాను అన్నాడు. అందుకే నా పెదాలు ఇలా అయిపోయాయి. కాబట్టి.. నా విలువైన సలహా ఏంటంటే .. మీకు పెదాలకి సర్జరీ చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మంచి వైద్యుడి దగ్గర చేయించుకోండి. తగిన డబ్బు ఏర్పాటు చేసుకోండి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus