’24’ రన్ టైమ్.. !

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’24’. సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 6 న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఈ చిత్రం మొత్తం నిడివి 164 నిమిషాలుగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

మరోవైపు మే 5 న సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని అమెరికా లో వీక్షించనున్నాడు. 2 డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన నిత్యా మీనన్, సమంతలు జంటగా నటిస్తున్నారు. ఏ‌ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus