Suriya: సూర్య కామెంట్లతో అభిమానుల్లో కొంతైనా మార్పు వస్తుందా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  (Suriya)  నవంబర్ నెలలో కంగువా  (Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవంబర్ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో సూర్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కలెక్షన్ల గురించి ఫ్యాన్స్ ఆలోచించడం ఆపండి అంటూ సూర్య తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. గతంలో సినిమా అంటే 50 రోజులు, 100 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితం అయ్యేది.

Suriya

సినిమా ఎన్ని రోజులు ఆడింది? ఎన్ని సెంటర్లలో ఆడింది? అనే లెక్కల ఆధారంగా సినిమాల రిజల్ట్ డిసైడ్ అయ్యేది. ప్రస్తుతం సినిమాల ఫలితాలకు కలెక్షన్లు కీలకం కానున్నాయి. అయితే కలెక్షన్ల విషయంలో అభిమానుల మధ్య కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి వార్స్ జరుగుతుండటం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్న ఫ్యాన్స్ కు షాకిచ్చేలా సూర్య కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అభిమానులు సినిమాలోని స్టోరీ, కంటెంట్, పాత్రల గురించి మాట్లాడుకోవాలని వాటి గురించి సెలబ్రేట్ చేసుకోవాలని కలెక్షన్ల గురించి అభిమానులకు ఎందుకు అని కామెంట్లు చేశారు. కలెక్షన్ల గురించి ఫ్యాన్స్ మాట్లాడుకోవడం ఆపేయాలని సూచించారు. సూర్య కామెంట్లతో అభిమానుల్లో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.

సూర్య ఇతర హీరోలకు భిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. సూర్య కెరీర్ ప్లానింగ్స్ అద్భుతంగా ఉన్నాయని టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా సూర్య నటించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సూర్య రెమ్యునరేషన్ రికార్డ్ స్థాయిలో ఉంది. సూర్య క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

దేవర విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను: కొరటాల శివ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus