దయచేసి ఓపికగా ఉండండి : ‘ఎన్.జి.కె’ ప్రొడ్యూసర్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఎన్.జి.కె’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు చిత్ర యూనిట్. దీని పై సూర్య ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారట. ఈ విషయం పై చిత్ర నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఎస్.ఆర్. ప్రభు ట్వీట్ చేస్తూ.. ‘ మీ ఆసక్తి ని నేను అర్ధం చేసుకోగలను, దయచేసి ఓపికగా ఉండండి.., అలాగే ‘ఎన్.జి.కె’ చిత్రానికి సంబంధించి ఎటువంటి లీక్స్ చేయొద్దంటూ’ సూర్య అభిమానులకి విన్నపించుకున్నాడు. ఈ చిత్రంలో సూర్య కు జోడీగా సాయి పల్లవి , రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus