సూర్య- జ్యోతిక ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇద్దరూ భార్యా భర్తలనే కాదు ఒకప్పుడు వీళ్ళు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇద్దరికీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. జ్యోతిక.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా కజిన్. ఇక సూర్య… ఒకప్పటి హీరో శివకుమార్ కొడుకు. సూర్య తమ్ముడు కార్తీ కూడా మంచి స్టార్ డం ను సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా వీరికి వీరాభిమానులు ఉన్నారు అనడంలో అతిసయోక్తి లేదు.
ఇదిలా ఉండగా.. సూర్య-జ్యోతిక ల జంట ఒక్కసారి కాదు రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారట. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. సూర్య-జ్యోతిక లు ప్రేమలో ఉన్నప్పుడు…వీరిద్దరి పెళ్ళికి సూర్య సూర్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.ముఖ్యంగా శివ కుమార్ కు సూర్యకి సినిమాల్లో నటించే అమ్మాయితో పెళ్ళి చేయకూడదు అని ముందుగా అనుకున్నాడు. అంతేకాకుండా వీరి మతాలు కూడా వేరు.దాంతో మొదట వీరు రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు.కొన్నాళ్ళ తర్వాత సూర్య తండ్రి రాజీపడి వీరిద్దరికీ మళ్ళీ కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్ళి చేసాడు.
అలా సూర్య- జ్యోతిక లు రెండు సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.అయితే ఇప్పుడు ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి సినిమాల్లో నటిస్తూనే ఎన్నో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే ‘జై భీమ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సూర్య.. హరి దర్శకత్వంలో ఓ సినిమా అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక జ్యోతిక కూడా ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!