నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య ప్రతిష్టాత్మక చిత్రం “కంగువ” టీజర్ విడుదల

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువ టీజర్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ తార దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంగువ టీజర్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. మరో నాలుగు భాషల్లో త్వరలోనే టీజర్ ను తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపారు. రెండు నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ లో విజువల్ గ్రాండియర్, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, మెస్మరైజ్ చేసే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఆకర్షణ అయ్యింది.

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా ప్రేక్షకులకు ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు మూవీ టీమ్ శ్రమిస్తోంది. టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా వచ్చే ఏడాది సమ్మర్ లో కంగువ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Kanguva - Glimpse | Suriya, Disha Patani | Devi Sri Prasad | Siva | Studio Green | UV Creations

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus