Pawan Kalyan: తొలిసారి బాబాయ్ కు సపోర్ట్ గా సుస్మిత పోస్ట్.. నిజం కోసమే నిలబడతాడంటూ?

ఏపీలో మరొక కొన్ని గంటలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఏపి ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. జనసేన పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో సినీ సెలబ్రిటీలు మొత్తం ఈయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే పిఠాపురంలో మెగా హీరోలు ప్రచార కార్యక్రమాలలో నిర్వహించారు.

అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. ఇక ప్రచార కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు రాంచరణ్ (Ram Charan)  ఆయన తల్లి సురేఖ కూడా పిఠాపురం నియోజకవర్గంలో సందడి చేశారు. ఇక ఎన్నికలు కొన్ని గంటలలో జరగబోతున్నాయి అన్న తరుణంలో మెగా డాటర్ కూడా తన బాబాయ్ గెలుపు కోసం స్పందించారు.

మెగా డాటర్ సుస్మిత (Sushmita Konidela) మొదటిసారి తన బాబాయ్ కోసం సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేశారు. అతని పోరాటం నిజమైనది ఆయన హృదయం ప్రజల కోసమే.. అతడు నిజం కోసమే నిలబడతాడు దయచేసి అండగా నిలబడండి అంటూ సుస్మిత తన బాబాయ్ ని గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ విధంగా మొదటిసారి తన బాబాయ్ కోసం సుస్మిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ క్షణాలలో వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కథ ఎన్నికలలో భాగంగా భీమవరం గాజువాక ప్రాంతాలలో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు కానీ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus