శ్రీవిష్ణు కెరీర్ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. ఏంటి ఒక్క విజయానికే అంత ఊపా అంటారా? విజయం ఒక్కటి అని కాదు.. ఆ విజయం వైబ్ అలాంటిది మరి. హిట్ కొడితే చాలు అనుకుంటున్న శ్రీవిష్ణు కెరీర్‌లో కెరీర్ బెస్ట్ రిజల్ట్, వసూళ్లు వచ్చాయి మరి. ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఊపులో తన కొత్త సినిమాకు అంతకుమించిన ఊపున్న టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ మాటను తరచుగా మనం స్టార్ హీరోల గురించి మాట్లాడేటప్పుడు వింటుంటాం. అదేంటో కాస్త థింక్ చేయండి.
టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడు శ్రీ విష్ణు. ఈ క్రమంలో కొన్ని మిస్ ఫైర్ అయ్యి.. ఇటీవల కాలంలో వెనుకబడ్డాడు. దీంతో ఫక్తు కమర్షియల్ కంటెంట్‌తో వచ్చినా ఇబ్బంది పడ్డాడు. ‘బ్రోచే వారెవరురా’, ‘రాజ రాజ చోర’ లాంటి విజయాలు తొలుత రాగా… ఆ తర్వాత ‘అర్జున ఫల్గుణ’, ‘భళా తందనాన’, ‘అల్లూరి’ లాంటి డిజాస్టర్లు పలకరించాయి. ఇలా వరుసగా సినిమాలు తేడా కొట్టడంతో (Sree Vishnu) శ్రీ విష్ణు పనైపోయిందని అనుకున్నారు కొందరు.
కానీ ఆ డౌట్లను పక్కనపెట్టేస్తూ… ‘సామజవరగమన’తో శ్రీ విష్ణు బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తనదైన టైమింగ్, డిక్షన్, యాటిట్యూడ్‌తో బాక్సాఫీస్ బాలుగా అదరగొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే ఉత్సాహంలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ చేస్తున్నాడు. ఆ సినిమా తీసిన దర్శకుడు హాసిత్ గోలినే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ‘స్వాగ్’ (SWAG) అని పేరును దాదాపు ఫైనల్ చేసేశారని టాక్.
హీరోలను కొనియాడుతూ అభిమానులు వాడేస్టైల్, గ్రేస్ లాంటి పదాల తరహాలోనే స్వాగ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పేరును సినిమాకు టైటిల్‌గా పెడుతున్నారంటే… దాని చుట్టూ ఏదో కథ ఉండే ఉంటుంది. అయితే SWAG అనే అక్షరాలకు వేరే అర్థం ఉంటుందని అంటున్నారు. స్వాగ్‌లో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది అని అంటున్నారు. ‘రాజ రాజ చోర’లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా కలరింగ్ ఇస్తూ దొంగతనాలు చేస్తుంటాడు హీరో. అంతకుముందు ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు అంటున్నారు.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?