‘హ్యాపీడేస్’ తర్వాత నిఖిల్ 7,8 సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి అర తప్ప హిట్ అయిన సినిమాలు ఏమీ లేవు. ఆ సినిమాలు ఏమీ అతనికి ప్రత్యేక గుర్తింపుని కూడా ఇవ్వలేకపోయాయి. అలాంటి టైంలో వచ్చిన మూవీ ‘స్వామిరారా’. సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీ 2013 వ సంవత్సరం మార్చి 23న విడుదలైంది. నిఖిల్ కు జోడీగా కలర్స్ స్వాతి నటించింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ మూవీ తర్వాత నిఖిల్ క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది.
మరి ఫుల్ రన్ ముగిసేసరికి ‘స్వామిరారా’ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
1.56 cr
సీడెడ్
0.67 cr
ఉత్తరాంధ్ర
0.89 cr
ఈస్ట్
0.34 cr
వెస్ట్
0.31 cr
గుంటూరు
1.02 cr
కృష్ణా
0.53 cr
నెల్లూరు
0.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.43 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
7.07 cr
‘స్వామిరారా’ చిత్రానికి రూ.3.92 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.7.07 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకి రూ.3.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని రూ.4 కోట్ల లోపు బడ్జెట్ లోనే తెరకెక్కించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ఈ మూవీకి మంచి లాభాలు దక్కాయి.