కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. కావ్య దొంగచాటుగా డిజైన్స్ వేయడం చూసిన రాజు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కలకు నేను విలువ ఇవ్వనని అనుకున్నావా అందుకే నాతో చెప్పలేదా అని రాజ్ నిలదీస్తాడు. ఈ విషయం నాతో చెప్పొచ్చుగా అంటూ రాజ్ అంటాడు.నేను మీ దృష్టిలో ముగ్గులు వేయడానికి తప్ప దేనికి పనికిరానని చెప్పారు. ఆ రోజు ఫారినర్స్ వచ్చి ఆఫీస్ లో కూర్చుని ఉండగా మీరు టెన్షన్ పడ్డారు.
నేను ఆఫీస్ కి వచ్చి డిజైన్స్ గీసి నీకు చూపించాను కానీ నువ్వు వేసే ముగ్గులు అనుకున్నావా అంటూ వాటిని చింపి పడేసావు. అదే డిజైన్స్ శృతి తీసుకొచ్చి మీకు చూపించగా ఎంతో అద్భుతంగా ఉన్నాయని పొగిడారు. ఆరోజు మాత్రమే కాదు అంతకుముందు నేను ఆఫీస్ కి వచ్చినప్పుడు మీరు అమ్మాయిని తిడుతుంటే అప్పుడు కూడా నేనే డిజైన్ వేసి పంపించాను.పెళ్ళాం వేస్తే ముగ్గుతో సమానం ఎంప్లాయ్ వేస్తే డిజైన్ అందుకే నేను శిరీషగా మారాల్సి వచ్చిందని కావ్య చెబుతుంది.
అయినా అంత డౌట్ ఉన్నప్పుడు నేరుగా నన్ను అడగొచ్చు కదా ఇలా నిద్రపోతూ ఉన్నట్టు నటించి నన్ను పట్టుకోవడం దేనికి అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. ఇక రాజ్ డబ్బులు ఇచ్చి ఇది నీ కష్టానికి ప్రతిఫలం ఇది శిరీషకు ఇచ్చినదని చెబుతాడు. నేను ఈ డబ్బు తీసుకునేది నాకోసం కాదు అని కావ్య చెప్పగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ డబ్బు నీ ఇష్టం శిరీష అని వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం కావ్య రాజ్ ఫోన్లో అలారం పెట్టి తనకు కాఫీ పెడుతుంది అలాగే తాను వేసుకోవడానికి డ్రెస్ కూడా సెలెక్ట్ చేస్తుంది కానీ రాజ్ మాత్రం ఆ డ్రెస్ వేసుకోడు.
దీంతో కావ్య బాధపడుతుంది.తర్వాత నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి రావచ్చా అని కావ్య అడుగుతుంది. అపర్ణ మళ్ళీ రాకపోకలు ఏంటి అనిఅడగడంతో చూడాలనిపిస్తుందని కావ్య చెబుతుంది. కన్నవాళ్ళను చూడటానికి మన పర్మిషన్ కావాలా అంటూ రాజ్ సపోర్ట్ చేస్తారు. అంతలోపు రుద్రాన్ని కలుగజేసుకొని ఒకసారి అత్తగారి ఇంటికి వెళ్లి వచ్చేసరికి వారికే సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతుంది. సపోర్ట్ చేయడం లేదత్త నీకు పుట్టిందేదో అత్తిలి లేదు తెలియకుండా ఇక్కడున్నారు. అయినా ఆ కుటుంబంతో సంబంధం లేనటువంటి నీకు మాట్లాడే అర్హత లేదని చెబుతాడు.
దాంతో చిట్టి కూడా నీ భర్త పర్మిషన్ ఇచ్చాడు. నేను కూడా ఇచ్చాను వెళ్లి రావచ్చు అని చెప్పడంతో అపర్ణ వెళ్లి వారం పాటు అక్కడే ఉండడానికి వీలు లేదని చెబుతుంది. దీంతో రాజ్ కారులో కావ్యను తన పుట్టింటికి తీసుకెళ్తుంది. మరోవైపు స్వప్న పొట్టి డ్రెస్ వేసుకొని రెడీ అవుతుండగా ఎక్కడికి అని రాహుల్ అడుగుతారు ఆడ్ షూటింగ్ కి అని చెప్పడంతో ఇలా వేసుకుని వెళ్తావా మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా ఉందా అని రాహుల్ చెప్పగా యాడ్ షూటింగ్ కోసం ఇలాగే వెళ్తారని రెడీ అవుతుంది.
వెళ్ళు నిన్ను ఇలా చూస్తే ఇంట్లో బాంబు పేలుతుందని రాహుల్ సంతోష పడుతుంటారు. అయితే స్వప్నను చూసిన ధాన్య లక్ష్మి ఈ అవతారం ఏంటి ఈ డ్రెస్ ఏంటి అంటూ తనని తిడుతుంది. ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉన్నాయి అంటూ తనని తిడుతుంది. మీరు నన్ను తిట్టే హక్కు మీకు లేదు అయినా మీలాగా నేను ఓల్డ్ జనరేషన్ అనుకున్నావా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని నగలు దిగేసుకొని కూర్చోవడానికి అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. రేపొద్దున మీ కొడుకు పెళ్లయి వచ్చే కోడలికి ఇలాంటి కండిషన్స్ పెడితే ఒక్కరోజు కూడా ఉండకుండా పారిపోతుంది.
కావాలంటే ప్రతిరోజు ఉదయం మీ మోహానా ఒక గుడ్ మార్నింగ్ పడేస్తాను అంటూ తన పట్ల దారుణంగా మాట్లాడుతుంది.మరోవైపు కారులో రాజు కావ్య వెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిపోతారు. అక్కడ పూలు అమ్మే ఆవిడ వచ్చి వారిని చూసి మీతో ఎందుకులే అని వెళ్ళిపోతుంది. కానీ రాజ్ తనని పిలిచి పువ్వులు కొనుక్కోవడంతో ఒక్కసారిగా పూలు ఆమె పెళ్లామె కాదన్నారు ఇప్పుడు పూలు కొనిస్తున్నారంటూ ఆశ్చర్యపోతుంది. రాజ్ ఆ పువ్వులు తీసుకొని కావ్యకు ఇవ్వడంతో కావ్య సంతోషంగా జడలో పెట్టుకుంటుంది.