బిగ్‌బాస్‌ 4: హౌస్‌మేట్స్‌ గురించి స్వాతి దీక్షిత్‌ ఏమందంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో మూడో వైల్డ్‌ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌ వారం తిరిగేసరికి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేసిన కారణంగా ఆమెను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు నాగార్జున చెప్పారు. మరి బయటకు వచ్చిన స్వాతి ఇంటి సభ్యుల గురించి ఏం చెప్పిందో చూద్దాం!

Click Here-> ‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

* కుమార్‌సాయిని నక్కతోక తొక్కినవాడిగా స్వాతి అభివర్ణించింది. కుమార్ టాలెంటెడ్‌ కానీ… ఎవరో ఒకరు పుష్‌ చేయాలి. దాని నుంచి ఆయన బయటపడాలని అని అంది.

* తనను నామినేట్‌ చేసిన అమ్మ రాజశేఖర్‌ను స్వాతి నమ్మక ద్రోహి ట్యాగ్‌ ఇచ్చింది. నేను ఇంటికి వచ్చిన రోజు నన్ను బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఫుడ్‌ కూడా పెట్టారు. తీరా నామినేషన్‌లో నా పేరు చెప్పారు. నువ్వు సేఫ్‌ అయిపోతావ్‌ లే అని అన్నారు. ఇది నమ్మక ద్రోహమే అంది స్వాతి.

* ఇంట్లో ప్రతి గాసిప్‌ ఆమె దగ్గర ఉంటుంది అంటూ సుజాతకు పుకార్ల పుట్ట అని పేరు పెట్టింది. రోజూ రాత్రి గాసిప్స్‌ ముచ్చట్ల సెషన్‌ ఉంటుందని కూడా చెప్పింది.

* ఇంట్లో దొంగ.. సోహైల్‌ అని అంది స్వాతి. స్వచ్ఛమైన మనసు ఉంది. అయితే కోపం ఎక్కువ. కోపంలో అనకూడని మాటలు అనేస్తుంటాడు. కోపం కంట్రోల్‌ చేసుకుంటే మంచింది అని చెప్పింది.

* ఇంట్లోకి వచ్చిన రోజు నన్ను బాగా రిసీవ్‌ చేసుకున్న లాస్య… తర్వాత నేను ‘రెండు వారాల తర్వాత వచ్చాను’ అనే మాట అనేది. నాకు ఏదో గేమ్‌ ప్లాన్‌ ఉంది అనుకునేది. నా దృష్టిలో ఆమెనే అవకాశవాది.

* ఇంట్లో నోయల్‌ అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు అని చెప్పింది స్వాతి. అమాయకుడు, ఏ విషయాన్నైనా సానుకూల దృక్పథంతో ఉంటాడు అని వివరించింది. అయితే మోనాల్‌ను గుడ్డిగా నమ్మొద్దు అని సూచించింది.

* ఇంట్లో ఒక్కోసారి మెహబూబ్‌ ఇండివిడ్యువల్‌గా ఆడుతుంటాడు. అయితే ఒక్కోసారి సోహైల్‌ మాటలకు ఇన్‌ప్లూయెన్స్‌ అవుతుంటాడు. అలాగే ఆరియానా ఓవర్‌ కాన్ఫిడెంట్‌ అనిపిస్తుంటుంది అని చెప్పింది స్వాతి.

* ఇంట్లో జనాలను తన మాటలు, చేతలతో మోనాల్‌ ఏమారుస్తోందని స్వాతి చెప్పింది. అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటోంది. అయితే అక్కడివిక్కడ చెప్పడం మోనాల్‌కు అలవాటు. ఆ మాటలతో ఏమారుస్తోంది. ఆ విషయం అఖిల్‌కు కూడా తెలియదు.

* హారికను ట్యూబ్‌లైట్‌తో పోల్చింది స్వాతి. ఏ విషయాన్నైనా ఒకటికి రెండు సార్లు వివరించాల్సి ఉంటుంది. ఇక అభిజీత్‌ను అహంకారి అని అంది స్వాతి. అతనిలో కొంత ఈగో ఉందనిపిస్తుంది. రిజక్షన్స్‌ తీసుకోలేడు అని అంది స్వాతి.

* గంగవ్వను స్వాతి చాడీల చిట్ట అంది. ఎప్పుడూ తిడుతూ ఉంటారు అని చెప్పింది. అలాగే అందరినీ నవ్విస్తూ అవినాష్‌ హౌస్‌లో ఫేవరేట్‌ అయ్యాడని చెప్పింది. ఇంట్లో పెద్ద కష్టం లేకుండా స్నేహితులం అయ్యాం అంటూ దివిని పొగిడేసింది.

* ఇంట్లో గమ్యం లేని పక్షిలా అఖిల్‌ కనిపిస్తున్నాడని స్వాతి చెప్పింది. అతని ఫోకస్‌ అంతా ఒకేవైపు ఉంది. గేమ్‌పైన ఉంటే బాగుంటుంది. గేమ్‌పై కాకుండా ఎమోషన్స్‌ పైన ఫోకస్‌ పెడుతున్నాడు అనిపిస్తోందని స్వాతి చెప్పింది.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus